Tuesday, April 23, 2024

బాల‌కృష్ణకి జోడీగా మెహ‌ర్రీన్

హీరో బాల‌కృష్ణ ..ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో న‌టించ‌నున్నారు. ఎన్‌బీకే 108 గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సబంధించిన చాలా విషయాల్లో షూటింగ్ కు ముందే క్లారిటీ ఇవ్వాలి అని చూస్తున్నారు అనిల్ . తాజాగా ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ తెర‌పైకి వ‌చ్చింది. పంజాబీ భామ మెహ‌రీన్‌కౌర్ ఎన్‌బీకే 108లో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలా వరుస సినిమాల్లో న‌టించింది మెహ‌రీన్‌. ఇక నాలుగో సారి అది కూడా సీనియర్ హీరో బాలయ్య బాబు సరసన నటించడానికి అనిల్ మెహరీన్‌ను ఒప్పించిన‌ట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు టీమ్. ఇక ఈ మూవీలో బాల‌కృష్ణ 50 ఇయర్స్ వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుత వ‌య‌స్సు కంటే ప‌దేళ్లు త‌క్కువ‌ ఏజ్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement