Thursday, March 28, 2024

తెలంగాణ యువ‌కుడిగా.. హీరో బాల‌కృష్ణ‌

తెలంగాణ ప్రాంతానికి చెందిన యువ‌కుడిగా క‌నిపించ‌నున్నార‌ట హీరో బాల‌కృష్ణ‌. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతుంది ఈ చిత్రం. కాగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారట బాల‌య్య‌. ఇంతవరకూ తెరపై ఎక్కువగా రాయలసీమ మాండలికంలో డైలాగ్స్ చెబుతూ వచ్చిన ఆయన, తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ సినిమాలో బాలయ్య 40 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా .. జైల్లో 14 ఏళ్ల శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్నాడు. కామెడీ టచ్ కొంతమాత్రమే ఉంటుందట. బాలయ్య మార్క్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement