Thursday, April 25, 2024

అల్లు అర్జున్ క్రేజ్-కోక కోలా యాడ్ కి 20మిలియ‌న్ల వ్యూస్

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దాంతో ప‌లు బ్రాండ్ ల‌కి అంబాసిడ‌ర్ గా బ‌న్నీని ఎంచుకుంటున్నారు. తాజాగా కోక కోలా బ్రాండ్ అంబాసర్ గా ఎంపికయ్యారు. దీంతో ఆయనపై ఓ యాడ్ షూట్ చేశారు. ఈ వీడియోలో బన్నీ మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. కాగా బన్నీ నటించిన కోక కోలా యాడ్ వీడియో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. ట్విట్టర్ లో బన్నీ కోక కోలా యాడ్ కి 20 మిలియన్ వ్యూస్ దక్కాయి. 7 రోజుల్లో బన్నీ ఈ ఫీట్ సాధించాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ అరడజనుకు పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసర్ గా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ కి సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement