Thursday, April 25, 2024

యూర‌ప్ లో బైక్ పై చ‌క్క‌ర్లు కొడుతోన్న- హీరో అజిత్

యూర‌ప్ లో త‌మిళ స్టార్ హీరో అజిత్ తనకు నచ్చిన ప్రదేశాలను స్వేచ్ఛగా బైక్ పైన తిరుగుతున్నాడు. అజిత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వలీమై దర్శకుడు హెచ్ వినోథ్ తోనే తన 61వ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ దీపావళికి విడుదల కానుంది. అలాగే అతని లిస్టులో మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం.. తనకు ఇష్టమైన బైక్ ట్రిప్స్ తో ఎంజాయ్ చేస్తారు అజిత్. బైక్ తీసుకొని వివిధ ప్రాంతాలపై చక్కర్లు కొట్టేస్తూ ఉంటారు. ఇప్పటికే అతను ఇండియాలో చాలా ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించారు.

తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడు కూడా చాలాసార్లు వెళ్ళారు. విదేశాల్లో కూడా తన బైక్ ట్రిప్స్ కొనసాగిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం యూరప్ లో ఉన్న అజిత్ అక్కడ ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ తీసుకొని అందమైన ప్రదేశాలను చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజిత్ తెల్ల జుట్టు గడ్డంతో కనిపించారు. అలాగే అతను నడుపుతున్న బైక్ BMW R1250RT నెంబర్ తో ఉంది ఇది దూర ప్రయాణాలలో గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందని అర్థమవుతొంది. అజిత్ ఒక్కడే కాకుండా తన వెంట కొంత మంది స్నేహితులను కూడా తీసుకు వెళుతూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement