Thursday, March 28, 2024

ఫీమేల్ లీడ్ రోల్ లో రుహాని శ‌ర్మ‌..టీజ‌ర్ రిలీజ్ చేసిన నాని

తొలిసారి ఫీమేల్ లీడ్ రోల్ లో న‌టిస్తోంది హీరోయిన్ రుహాని శ‌ర్మ‌. HER అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకూ సాఫ్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్న ఈ హీరోయిన్, తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. HER Chapter 1 అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తనలోని మరో యాంగిల్ చూపించేందుకు రెడీ అయింది.రఘు – దీప నిర్మించిన ఈ సినిమాకి, శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించాడు. వికాస్ వశిష్ట .. ప్రదీప్ రుద్ర .. జీవన్ కుమార్ .. అభిజ్ఞ .. సంజయ్ స్వరూప్ .. బెనర్జీ .. రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు నాని.ఈ టీజర్ లో రుహాని శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియో లోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహాణి శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్, ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement