Thursday, April 18, 2024

రాజీవ్ గాంధీ కలలను సాకారం చేద్దాం.. ఆపన్నులను ఆదుకుందాం: రాహుల్​ గాంధీ లేఖ

సంక్షోభ సమయంలో వివక్ష లేకుండా ప్రజలకు సహాయం చేయడంలో కాంగ్రెస్​ పార్టీ యువజన విభాగం కృషిని పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. రాజీవ్ గాంధీ దార్శనికత, భారతదేశానికి ఆయన చేసిన కృషిని గౌరవించేలా ‘రాజీవ్: ఏక్ సంకల్ప్’ కార్యక్రమాన్ని నిర్వహించడంపై శనివారం ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి)ని అభినందించారు. ప్రగతిశీల విధానం, అందరినీ కలుపుకొని పోయే దృక్పథాన్ని రూపొందించడంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) కీలక పాత్ర పోషించిందని ఓ లేఖలో పేర్కొన్నారు.

“IYC రాజీవ్ కవాచ్, SOSIYC బ్లడ్ కనెక్ట్, దేశవ్యాప్తంగా యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ ప్రారంభించినందుకు IYCని కూడా నేను అభినందించాలనుకుంటున్నాను. IYC యొక్క రాజీవ్ కవాచ్ ప్రత్యేకించి ప్రశంసలకు అర్హుడు” అని లేఖలో పేర్కొన్నారు. “మా IYC కార్యకర్తలు సంక్షోభ సమయాల్లో వివక్ష లేకుండా ప్రజలకు మళ్లీ మళ్లీ సహాయం చేశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను” అని రాహుల్​ అన్నారు.

రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన తండ్రికి ఉద్వేగభరితమైన ట్వీట్ చేస్తూ, దేశం కోసం తన తండ్రి కలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని అన్నారు. “నా హృదయంలో ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు. దేశం కోసం మీరు కన్న కలలను నెరవేర్చడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను’ అని ట్వీట్ చేశారు.

కాగా, మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఆత్మాహుతి (మానవ బాంబు) దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు 14 మంది చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement