Wednesday, March 29, 2023

జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

జైపూర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుడి వ‌ద్ద సుమారు 769.5 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 41 ల‌క్ష‌లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. షార్జా నుంచి ఎయిర్ అరేబియా ఫ్ల‌యిట్ ద్వారా ఆ ప్ర‌యాణికుడు వ‌చ్చాడు. అదికారులకు అనుమానం రావ‌డంతో అత‌న్ని సోదా చేశారు. మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ త‌ర్వాత ఆ ప్ర‌యాణికుడి మ‌ల‌ద్వారం నుంచి మూడు క్యాప్సుల్స్‌ను రిక‌వ‌ర్ చేశారు. సీటీ స్కాన్ నిర్వ‌హించిన త‌ర్వాత అత‌ని వ‌ద్ద ఆ బంగారు క్యాప్సుల్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. మూడు క్యాప్సుల్స్‌లో ప‌సుపు రంగు గుళిక‌లు ఉన్నాయి. పాలీథీన్ టేపుతో ఆ క్యాప్సుల్స్‌ను చుట్టి ఉంచారు. నిందితుడిని అరెస్టు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement