Saturday, April 20, 2024

ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్, గురుగ్రామ్, మనేసర్, ఫరిదాబాద్, నోయిడా, సోనిపట్, రోహ్‌తక్ తదతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండు మూడు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 70 మి.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement