Monday, October 14, 2024

HYD | ఉరుములు, మెరుపులతో భారీ వర్షం !!

హైదరాబాద్‌లో వర్షం కుండ‌పోత వ‌ర్షం కురుస్తొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

కోఠీ, బషిం బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోరి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్ బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లక్షీకపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఆఫీస్‌ల నుంచి ఇంటి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభిచడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement