Friday, October 4, 2024

Heavy Rain – దేశ ఆర్ధిక రాజధానిలో కుంభవృష్టి – జనజీవనం అస్తవ్యస్తం

ముంబయి – దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల రహదారులపైకి వరద నీరు చేయడంతో వాహనదారులు అవస్థలు పడ్డాయి. ఇక, అర్ధరాత్రి వేళ ఠాణెలో కొండచరియలు బీభత్సం సృష్టించాయి.ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఠాణెలోని ముంబ్రా బైపాస్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో 3 గంటలకు పైగా ట్రాఫిక్‌ స్తంభించింది.

వర్షాల కారణంగా దాదాపు 14 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం వరకు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దీంతో ముంబయి, శివారు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ గురువారం సెలవు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement