Friday, November 8, 2024

Heavy Rain – ఢిల్లీని ముంచిన వ‌ర్షం….24 గంట‌ల‌లో 23 సెంటిమీట‌ర్ల వ‌ర్షం…

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు.. వంట సామాగ్రి అన్ని తడిసిముద్దవ్వడంతో ప్రజల పాట్లు వర్ణణాతీతంగా మారాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు లేక నగర వాసులు నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడేమో బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది.

మరోవైపు ప్రధాన జంక్షన్ల దగ్గర నీరు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరికొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఇలా నగరంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. తాగునీటి కోసం నిరాహార దీక్ష చేసిన ఢిల్లీ మంత్రి అతిషి.. ఇప్పుడు నీళ్లు మళ్లించడం కోసం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఇంతలోనే ఎంత మార్పులు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. 1936లో కురిసిన వర్షం.. మళ్లీ ఇన్నాళ్లకు కురిసినట్లుగా వెల్లడించింది. దాదాపు 88 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షం దేశ రాజధానిలో నమోదైనట్లుగా పేర్కొంది. 24 గంటల్లో ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లుగా తెలిపింది.

ఇక ఐటీవో, హనుమాన్‌ టెంపుల్‌ ఇంటర్‌సెక్షన్‌, మండి హౌస్‌, అశోకా రోడ్‌, ఫిరోజ్‌ షా రోడ్‌, కన్నాట్‌ ప్లేస్‌ వంటి ప్రధాన ప్రాంతాల్లో రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మూల్‌చంద్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్-1 దగ్గర పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement