Thursday, April 18, 2024

Heavy Rains: అనంతలో భారీ వర్షం.. నడిపివంకకు వరద, నీటి ముంపులో కాల‌నీలు

అనంతపురం (ప్రభ న్యూస్ బ్యూరో) : ఏపీలోని అనంతపురం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంత సిటీ ని వరద ముంచెత్తింది. నడిమి వంకకు వచ్చిన వ‌ర‌ద‌ల‌ వల్ల సుమారు 15 కాలనీలు మునిగిపోయాయి. వేలాదిమంది కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వ‌చ్చారు. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి చంద్రబాబునగర్, దండోరా కాలనీ, ముత్యాలప్ప కాలనీ, ఐదవ రోడ్డు, ఆరవ రోడ్డు, పక్కన ఉన్న కాలనీ నీట మునిగిపోవడంతో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి రాత్రి నుంచి సహాయక చర్యల్లో మునిగి పోయారు.

వరద అధికంగా ఉండడంతో ఏ ఒక్కరు ఇళ్లల్లో ఉండవద్దని సహాయక శిబిరాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. శిబిరాల్లో భోజన వసతి ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప అర్ధరాత్రి నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు. బుధవారం వరద మరింత పెరగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రతి వార్డులో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన వసతిని సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement