Friday, March 29, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిపై క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అనుమానం రాగా.. త‌నిఖీలు నిర్వ‌హించారు. అత‌డి మొబైల్ ఫోన్ బ్యాక్ క‌వ‌ర్ లో బంగారాన్ని దాచిపెట్టిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అత‌డి వ‌ద్ద 533 గ్రాముల బంగారం ప‌ట్టుకుని, ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు. ఈ బంగారం విలువ సుమారు రూ.33 లక్షల 11 వేల ఉంటుంద‌ని క‌స్టమ్స్ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement