Monday, November 11, 2024

TG | నిజాంసాగర్ కు భారీ వ‌ర‌ద‌.. ఐదు గేట్లు ఎత్తివేత !

నిజాంసాగర్ (ప్రభ న్యూస్) : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 39 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని, అంతే మొత్తాన్ని దిగువ మంజీరాకు విడుదల చేస్తున్నామని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా… ప్రస్తుతం 17.252 టీఎంసీల నీటి నిల్వతో 1404.62 అడుగుల వద్ద కొనసాగుతోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement