Saturday, April 20, 2024

టీకాపై అనుమానాలొద్దు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. దేశంలోని రెండు రకాల వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని లోక్ సభలో హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో టీకాకు కొరత లేదని, టీకాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

మరోవైపు దేశంలో క‌రోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. గ‌త‌ 24 గంట‌ల్లో 39,726 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,14,331కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 154 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,370 కు పెరిగింది. దేశవ్యాప్తంగా 3,93,39,817 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement