Saturday, April 13, 2024

నోరూరించే ఈతపండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతి ప్రసాధించిన పండ్లలో ఈతపండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో ఇవి పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈతపండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్లలో దొరుకుతాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తియ్యగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకూ పచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి.

వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈతపండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈ సీజన్‌లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.

ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్ గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్దకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినటం వలన వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగనిరోధాల శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement