Monday, July 26, 2021

కెసిఆర్ పై యుద్ధం చెయ్యటానికే రాజీనామా….ఈటెల

ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని అన్నారు ఈటెల రాజేందర్. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన ఈటెల స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబ ఫ్యూడల్ పాలనను అంతం చేయడమే నా ఎజెండా అని… ఇతర పార్టీల నుండి గెలిచినవారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారని అన్నారు . కెసిఆర్ వంద కోట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని… నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఏడు సంవత్సరాలు మంత్రిగా పని చేశానని నాకు ఎమ్మెల్యే పదవి గొప్ప కాకపోయినా కెసిఆర్ పై పోరాటంలో ఎమ్మెల్యే పదవి ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు.

తెలంగాణ మేధావులంతా కేసీఆర్ పై పోరాటంలో కలిసిరావాలని కోరారు. కానీ కేసీఆర్ ను ఓడించేందుకు హుజురాబాద్ లో యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈటెల.

కెసిఆర్ పై యుద్ధం చెయ్యటానికే రాజీనామా….ఈటెల
Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News