Saturday, June 3, 2023

బైక్పై వచ్చుడు.. గొలుసులు గుంజుడు.. చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌..

హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. బంగారం వేసుకుని బయటకు వెళ్లాలంటేనే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల నిర్మాణుశ్య ప్రదేశాల్లో ఒంటరిగా కనిపించే మహిళల మెడలో చైన్‌లు దొంగిలిస్తున్నారు. కొందరు బెదిరింపులు చేసి.. మరికొందరైతే ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. న‌గ‌రంలో చైన్‌స్నాచింగ్‌ ముఠా సభ్యులు అంతుచిక్కకుండా పోవడం, వెంటవెంటనే వరుస దొంగతనాలు జరగడంతో పోలీస్‌ బాస్‌లు సీరియ్‌సగా తీసుకున్నారు. దీంతో పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. దొంగలు నగరం దాటకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బృందాలతో నగరాన్ని జల్లెడ పట్టారు. తాజాగా నగరంలో వరుస దొంగతనాలు చేసిన ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో వరస దొంగతనాలు చేసిన దొంగల ముఠా సభ్యులు, పారిపోయే అవకాశం కోసం చూస్తూ, ఫుట్‌పాత్‌లపై ఉంటున్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన ఆధారాలతో చోరీకి పాల్పడింది పాత నేరస్థులే అని పోలీసులు గుర్తించారు. ఎల్‌బీనగర్‌తో పాటు ఇంకా ఎక్కడెక్కడ చోరీలు చేశారనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement