Saturday, October 5, 2024

Hatrick President: టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోడాన్ మూడో సారి విజయం

టర్కీ దేశంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్డోగాన్ మూడవసారి ఎన్నికయ్యారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తిరిగి ఎన్నికల్లో గెలుపొందారు. టర్కీ దేశంలో అధిక ద్రవ్యోల్బణం,భారీ భూకంపం తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడవ దశాబ్దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎర్డోగాన్ నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎర్డోగాన్‌కు 52శాతం ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థి కెమల్ కిలిక్‌డరోగ్లుకి 48శాతం ఓట్లు వచ్చాయి. టర్కీ ఎలక్టోరల్ బోర్డ్ అధిపతి ఎర్డోగాన్ విజయాన్ని ధృవీకరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement