Friday, April 19, 2024

హార్థిక్‌ పాండ్యా అరుదైన ఘనత

టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ సంపాదించుకున్న యంగెస్ట్‌ క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఈ ఘనతలో ప్రపంచంలోనే అతి పెద్ద గుర్తింపు సాధించాడు. ఈ ఘనతతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. పాండ్యా, టెన్నిస్‌ దిగ్గజాల రఫెల్‌ నాదల్‌, రోజర్‌ ఫెదరర్‌ , డచ్‌ రేసింగ్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వంటి దిగ్గజాల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని హార్థిక్‌ ఈ అరుదైన రికార్డును క్రియేట్‌ చేశాడు.

ఈ సందర్బంగా హార్థిక్‌ తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్ట్‌ పెట్టాడు. ”నాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతీ ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పాండ్యా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో పాండ్యాను 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అంటే 25 కోట్ల మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడన్న మాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement