Saturday, April 20, 2024

రాహుల్‌ సిప్లిగంజ్‌కు హరీష్‌ అభయ హస్తం

బిగ్ బాస్-3 సీజన్ విజేతగా నిలిచిన టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు మంత్రి హరీష్‌రావు అభయ హస్తం ఇచ్చారు. రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న ‘చిచ్చా’ సినిమా పోస్టర్, టైటిల్ సాంగ్‌ను మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాహుల్ తెలంగాణ బిడ్డ అని పేర్కొన్నారు. ‘చిచ్చా’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని, రాహుల్ మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా తాను అందిస్తానని మాటిచ్చారు. బిగ్ బాస్ తరహాలోనే ఈ సినిమాతో విజయం సాధించి చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సినిమా టైటిల్ ‘చిచ్చా’ తనకు బాగా నచ్చిందని, తెలంగాణ బ్రాండ్ ఇమేజిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఉందని కొనియాడారు. కాగా ఆర్ఎస్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానరుపై వస్తున్న ‘చిచ్చా’ చిత్రానికి మల్లిక్ కందుకూరి దర్శకుడు.

మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ దుస్తుల వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఊకో కాకా పేరుతో హైదరాబాదులోనూ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ షోరూమ్ లు ప్రారంభించాడు. తాజాగా సిద్ధిపేటలోనూ ‘ఊకో కాకా’ పేరుతో షోరూమ్ ఏర్పాటు చేయగా, మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగానే ‘చిచ్చా’ సినిమా పోస్టర్, టైటిల్ సాంగ్‌లను లాంచ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement