Saturday, October 5, 2024

Harini Amarasuriya | శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి ప్ర‌మాణం !

శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న దినేష్ గుణవర్ధన సోమవారం రాజీనామా చేయగా…. కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య పేరును ప్రకటించారు. ఈ క్ర‌మంలో నేషనల్ పీపుల్స్ పవర్‌కు చెందిన హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరిని కేబినెట్ మంత్రులుగా నియమించారు.

సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి అమరసూర్య కావడం గమనార్హం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement