Tuesday, November 29, 2022

ట్వీట్ చేసిన హరి హర వీరమల్లు టీం.. మా ప్రయత్నానికి మీ మద్దతు ఇవ్వండి

హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సినిమా షూటింగ్ లొకేషన్‌లో డైరెక్టర్ క్రిష్‌ మానిటర్‌ చెక్‌ చేసుకుంటున్న స్టిల్‌తోపాటు మరోవైపు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, క్రిష్‌ టీం సెట్స్‌లో చర్చించుకుంటున్న ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ షూటింగ్ పై అప్ డేట్ ని అందించింది ఈ చిత్ర టీం.చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న నాణ్యమైన సినిమాను తీయడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టులో హరిహర వీరమల్లు షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమా ప్రపంచంలోని ప్రేక్షకులంతా సెలబ్రేట్‌ చేసుకునే మైలురాయి అవుతుందని నమ్మకంతో ఉన్నాం. సిల్వర్ స్క్రీన్‌పై అద్బుతాన్ని సృష్టించడం కోసం చేసే మా ప్రయత్నానికి మీ మద్దతు, ప్రేమ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని సందేశంలో రాసుకొచ్చింది టీం.

Advertisement

తాజా వార్తలు

Advertisement