Thursday, April 25, 2024

ఎన్టీఆర్30 పై కొరటాల కఠోర శ్రమ.. పక్కా ప్లాన్ తో షూటింగ్

కొరటాల శివ చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్న ‘ఎన్టీఆర్30’. ఈ మూవీ పై నిన్న జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడారు. మూవీ అప్డేట్స్ గురించి అభిమానులు చేస్తున్న గోల కారణంగా ప్రొడ్యూసర్ ల పై ప్రెషర్ పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. అభిమానులకు నచ్చేలా అప్డేట్స్ ఇవ్వాలనే ఏ సినిమా వారైనా అనుకుంటారని.. ఏదైనా అప్డేట్స్ ఉంటే ముందు మీకే చెప్తాం.. మూవీ మేకర్స్ పై ప్రెషర్ తీసుకురావద్దని రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్.

కాగా, చాలా కాలంగా ఎన్టీఆర్30 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు డైరెక్టర్ కొరటాల. తగిన ఫలితాన్ని రాబట్టటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ నవంబర్‌ నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా ఎన్టీఆర్ 30 షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసాడు కొరటాల. మొత్తం మూవీ షూటింగ్ ను 9 నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాడు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ కూడా అమలులోకి వచ్చింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత అదే ప్లాన్ కు కట్టుబడి ఉంటారట. ప్రొడక్షన్ ఖర్చులు అదుపులో ఉండేందుకు గాను అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30ని ఫ్లోర్‌లపైకి తీసుకెళ్లేందుకు గతంలో కంటే మెరుగ్గా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement