Friday, April 19, 2024

నయనతార పుట్టినరోజు.. కనెక్ట్ నుండి మూవీ టీజర్

నేడు స్టార్ హీరోయిన్ నయనతార పుట్టినరోజు..ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కనెక్ట్ మూవీ టీజర్‌ను లాంఛ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రలు పోషిస్తున్నారు. హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు. అశ్విన్‌ శరవనన్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్‌ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.నయనతార సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ సినిమా చేస్తోంది. దీంతోపాటు తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో నాలుగు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement