Friday, October 11, 2024

TG | రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను, ప్రకృతిని దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సంప్రదాయాల్లో విశిష్టమైనదని అన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మహిళలు, చిన్నారులతో ప్రత్యేక సందడి నెలకొంటుందని కేసీఆర్ గుర్తు చేశారు.

ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల పాటుసాగే బతుకమ్మ పండుగను ఆటాపాటలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని ప్రార్థించారు కేసీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement