Saturday, November 26, 2022

తేజ స‌జ్జా హ‌నుమాన్ మూవీ.. టీజ‌ర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్

యంగ్ హీరో తేజ స‌జ్జా న‌టిస్తోన్న తాజా చిత్రం హ‌నుమాన్. ప్రశాంత్‌ వర్మ సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో ‘హనుమాన్‌’ అనే పాన్‌ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా చిత్రబృందం టీజర్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. హనుమాన్‌ టీజర్‌ను నవంబర్‌ 21న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సూపర్‌ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్‌ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్‌ ఫేం వినయ్‌రాయ్ విల‌న్ గా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement