Tuesday, April 16, 2024

బ్యాచిల‌ర్ పార్టీని ఎంజాయ్ చేస్తోన్న హ‌న్సిక‌.. వైర‌ల్ గా వీడియో

బ్యాచిల‌ర్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ హ‌న్సిక‌.ఈ మేర‌కు ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఓ వీడియోని పోస్ట్ చేయ‌గా..తెగ వైర‌ల్ అవుతోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ను హన్సిక వివాహమాడనుంది. డిసెంబర్‌ 4వ తేదీన జైపూర్‌లోని ముంటోడా ప్యాలెస్‌లో బంధుమిత్రుల సమక్షంలో హన్సిక వివాహం చేసుకోనుంది.

వివాహం దగ్గరపడుతోన్న తరుణంలో హన్సిక సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తోంది. స్నేహితురాళ్లతో కలిసి విదేశాల్లో బ్యాచిలర్స్‌ పార్టీలో హల్చల్‌ చేస్తోంది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది హన్సిక. ఈ అందాల తార చేసిన హంగామా ఓ రేంజ్‌లో ఉంది. స్నేహితురాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం గ్రీస్‌లో ఉన్న హన్సిక తెగ ఎంజాయ్‌ చేస్తోంది. ఈ వీడియోలో హన్సిక గ్లామర్‌ డోస్‌ను కూడా పెంచేసింది. వైట్‌ డ్రస్‌లో హాట్‌ హాట్‌ లుక్స్‌లో మెస్మరైజ్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement