Tuesday, April 16, 2024

ఇంట్రెస్టింగ్ గా.. గుర్తుందా శీతాకాలం చిత్రం ట్రైలర్

గుర్తుందా శీతాకాలం చిత్రం నుండి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో సరికొత్త సత్యదేవ్ ను చూపించారు. రొమాంటిక్ యాంగిల్ లో ఆకట్టుకుంటున్నారు ఈ హీరో . థియేట్రికల్ ట్రైలర్ బ్యూటీఫుల్ గా ఉంది. ముగ్గురు హీరోయిన్లతో సత్యదేవ్ లవ్ స్టోరీస్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తమన్నాతో.. సత్య దేవ్ రొమాన్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ముగ్గురితో సత్యదేవ్ ఎందుకు ప్రేమలో పడతాడు.. చివరికి ఎవరితో ఉండిపోతాడు.. ఈ మూడు ప్రేమకథలకు శీతాకాలానికి సంబంధం ఏంటనే అంశాలపై ‘థియేట్రికల్ ట్రైలర్’ ద్వారా మరింతగా ఆసక్తి పెంచారు.

డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్, నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్పిస్తున్నారు. కెరీర్ లో మొదటిసారి సత్యదేవ్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నారు. తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు నాగ శేఖర్ దర్వకత్వం వహించారు. కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement