Friday, April 19, 2024

గుర్తుందా శీతాకాలంలో నాలుగు డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీస్.. హీరో స‌త్య‌దేవ్

గుర్తుందా శీతాకాలం ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయని హీరో స‌త్య‌దేవ్ తెలిపాడు.. ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఒక సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ నాలుగు ఫేజ్ స్ అయిపోయినవాళ్లు ఉంటారు,ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి. ఈ సినిమాను భూపాల అన్న రాసేసి డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించాడు నాగశేఖర్ అన్న. ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ గీతాంజలి అన్నట్లు ఈ సినిమాను చేసాడు.

ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మి భూపాల అన్న నా సినిమా అంటే పెన్ , పేపర్ తో పాటు ప్రేమను కూడా కలుపుతారు. కాల భైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం గుర్తుండిపోతుంది” అంటూ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రంతో తెలుగులో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ .. మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు, ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement