Sunday, March 26, 2023

Telangana | తుపాకీ ఎక్కుపెట్టి, క‌త్తుల‌తో పొడిచి కంటైన‌ర్‌తో పరారీ.. బాల్కొండ‌లో దారిదోపిడీ కలకలం

బాల్కొండ, (ప్రభ న్యూస్) : తుపాకిని ఎక్కుపెట్టి కత్తులతో పొడిచి కంటైనర్ తో పరారైన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) జ‌రిగింది. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ శివారులో డ్రైవర్ ను కంటైనర్ ను వదిలి వెళ్లారు. బాల్కొండ ఎస్సై గోపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆర్మూర్ వైపు హల్దీరాం ప్రొడక్ట్స్ తో వస్తున్న కంటైనర్ ను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద జాతీయ రహదారి 44 పై గుర్తు తెలియని వ్య‌క్తులు ఆపారు. డ్రైవర్ గన్నుతో బెదిరించి, కత్తులతో పొడిచి బలవంతంగా తమ కారులో ఎక్కించుకున్నారు.

- Advertisement -
   

కంటైనర్ ను దుండగులు తీసుకెళ్లి ప్రొడక్ట్స్ ఖాళీ చేసి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద జాతీయ రహదారి 44పై డ్రైవర్ ను, కంటైన‌ర్‌ ను వదిలి పరారయ్యారు. 108 వాహనంలో డ్రైవర్ ప్రఫూల్ ఆనందరావును ఆర్మూన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత ఆయన చికిత్స పొందుతున్నాడు. సినిమాను తలపించేలా జరిగిన ఈ దారిదోపిడీ ఘ‌ట‌న‌పై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement