Wednesday, April 17, 2024

Green India Challenge | గ్రీన్​ ఇండియా చాలెంజ్​ మహాద్భుతం.. పర్యావరణ వేత్త డాక్టర్​ సతీష్​ శిఖ పొగడ్తలు

బీఆర్​ఎస్​ ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ చేపట్టిన ‘‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’’​ కార్యక్రమం ఎంతో గొప్పదని, భావితరాలకు స్ఫూర్తిదాయకం అని  అభినందించారు గ్లోబల్​ వార్మింగ్​ యాక్టివిస్ట్​ డాక్టర్​ సతీష్​ శిఖ. ఇవ్వాల (శనివారం) ఆయన హైదరాబాద్​లో ఎంపీ సంతోష్​ కుమార్​తో భేటీ అయ్యారు. ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​గా సతీష్​ శిఖ తన లాభదాయకమైన ఫ్యాషన్​ డిజైనింగ్​ వృత్తిని వదిలేసి 2007 నుంచి గ్లోబల్​ వార్మింగ్​ వ్యతిరేక యాక్టిస్టుగా మారారు.

తన కార్యక్రమాలు మెచ్చి.. పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను మంగోలియాలోని ఎకో ఏషియా విశ్వవిద్యాలయం డాక్టర్​ సతీష్​ శిఖకు గౌరవ డాక్టటేట్‌ను ప్రదానం చేసింది.  ఇక.. భారతదేశం అంతటా నిరుపేద పిల్లల్లో సంతోషాలు నింపాలన్న ఉద్దేశంతో వారికి మద్దతు ఇవ్వడానికి ఒక ఎన్​జీవో ‘‘90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్’’ ని డాక్టర్ సతీష్ శిఖా స్థాపించారు. 

ఇంకా.. డాక్టర్ శిఖా 2007లో ఒక కిలోమీటరు పొడవునా ఎకో గ్రీన్ హ్యాండ్ మేడ్ సిల్క్ క్లాత్ ఫాబ్రిక్‌ని నిర్మించారు. ప్రముఖులు, సెలబ్రిటీల నుండి సిల్క్ క్లాత్‌పై (ప్రతి సందేశానికి ఒక గజం) పర్యావరణానికి మద్దతుగా సందేశాలు వచ్చాయి. 72 దేశాల నుండి సుమారు 1,263 మంది ప్రముఖులు, పర్యావరణ కార్యకర్తల సందేశాలతో సిల్క్ క్లాత్ 1.2 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుగా మారింది.

కాగా, ఎంపీ జోగినపల్లి సంతోష్ తన గ్రీన్ ఇండియా చాలెంజ్ చొరవతో పర్యావరణానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా డాక్టర్ శిఖా 1 గజం సిల్క్ ఫాబ్రిక్‌పై ఆయన సందేశాన్ని ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన అభ్యర్థనను గౌరవిస్తూ పట్టు వస్త్రంపై సందేశం ఇచ్చారు ఎంపీ సంతోష్.  “చెట్లు రక్షిస్తాయి.. ప్రోత్సహించండి. పర్యావరణాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి & భూగోళాన్ని రక్షించండి” అనే సందేశాన్ని ఆ సిల్క్​ ఫ్యాబ్రిక్​పై రాశారు. కాగా, సానుకూల శక్తి & గురుత్వాకర్షణకు చిహ్నంగా ఉండే గుడ్ లక్ రాగి నాణేన్ని ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ ఎంపీ జోగినపల్లి సంతోష్​కు అందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రయత్నాలను ప్రశంసించారు. నిరంతరం ఇట్లాంటి కార్యక్రమానిన కొనసాగించాలని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement