Saturday, April 20, 2024

కరోనాపై పోరాటానికి గ్రీన్ కో సంస్థ చేయూత

కరోనా కట్టడికి చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా గ్రీన్ కో సంస్థ చేయూత అందించింది. ఈ మేరకు పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 15 ఆటోమేటిక్ ఆక్సిజన్ మిషన్స్, 10 ఆక్సిజన్ సిలిండర్లను నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అందజేశారు. ఈ మిషన్స్, సిలిండర్ల లారీని పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే తనయుడు కాటసాని శివ నరసింహారెడ్డి, పలువురు వైసీపీ నేతలు, 32వ వార్డు వైసీపీ కార్పొరేటర్ సాన శ్రీనివాసులు పాల్గొన్నారు.

అటు గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి కూడా సాయం అందజేసింది. ఈ మేరకు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసింది. చైనా నుంచి ప్రత్యేకంగా వచ్చిన విమానంలోని వాటిని మంత్రి కేటీఆర్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా గ్రీన్ కో సంస్థ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా కట్టడికి సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచినందుకు మంత్రి కేటీఆర్ ఆ సంస్థ చైర్మన్ గోపికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, సమయానికి ఆక్సిజన్ అందించడమే సవాలుగా మారిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement