Thursday, March 28, 2024

26 నుంచి గ్రాండ్‌ నర్సరీ మేళా.. అయిదు రోజులపాటు ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌, అగ్రకల్చర్‌ షో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేడు మొక్కలు నాటడం అంటే రాబోయే తరాలకు భవిష్యత్‌ ఇవ్వడమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. శుక్రవారం తన నివాసంలో 13వ గ్రాండ్‌ నర్సరీ మేళా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌, అగ్రకల్చర్‌ షో ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

అయిదు రోజులపాటు నిర్వహించే ఈ షోలో హార్టికల్చర్‌ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. ఢిల్లి, హర్యానా, కోల్‌కత్తా, బెంగళూరుతదితర రాష్ట్రాల నుంచి మొక్కలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ నెల 26 నుంచి 30 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు షో కొనసాగుతుందన్నారు. సౌదీ అరేబియా నుంచి తెచ్చిన టిష్యూకల్చర్‌ వెరైటీ డేట్‌ ఫామ్‌ ప్రత్యేక ఆకర్షణగా అందుబాటులో ఉండనుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement