Wednesday, December 11, 2024

Delhi గ్రాప్‌-3 ఆంక్షలు… స్కూళ్లు, మైనింగ్‌ కార్యకలాపాలు బంద్‌

దేశ రాజధాని నగరం ఢిల్లిలో వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారుతోంది. రోజు రోజుకి గాలి నాణ్యత (ఏక్యుఐ) స్థాయిలు క్షీణిస్తున్నాయి. గురువారం ఏక్యూఐ 429 పాయింట్లుగా నమోదైంది. రాబోయే రోజుల్లో కాలుష్యం మరింత క్షీణించొచ్చన్న అంచనాలతో ఈ నేపథ్యంలో ఢిల్లిలోని ఆప్‌ ప్రభుత్వం కాలుష్య కారక చర్యలపై ఆంక్షల కొరఢా ఝులిపిస్తోంది.

కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సిఏక్యుఎం) గ్రాప్‌-3 (గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-3వ దశ) ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికింద కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు అమల్లోకి వస్తాయి. గ్రాప్‌-3 మార్గదర్శకాలు నేటి నుంచి (శుక్రవారం) అమల్లోకి రానున్నాయి.

ఈ ఆంక్షల్లో భాగంగా, నిర్మాణాలు, కూల్చివేతల నిలిపివేత సహా ప్రజా కార్యకలాపాలపై నియంత్రణలు ఉంటాయి. స్కూళ్లు, మైనింగ్‌ కార్యకలాపాలు కూడా పూర్తిగా నిలిపివేయబడతాయని ఢిల్లి పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ చెప్పారు. అలాగే, నాన్‌ ఎలక్ట్రిక్‌, నాన్‌-సీఎన్‌జీ, నాన్‌ బీఎస్‌-6 డీజిల్‌ బస్సు సర్వీసులను తగ్గిస్తారు. ఎన్‌సీఆర్‌ వాయు కాలుష్యంలో దాదాపు 34శాతం పరిసల ప్రాంతాలే కారణమని అధికారులు నిర్దారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement