Thursday, April 25, 2024

విద్వేష వీడియోల‌పై కేంద్రం చ‌ర్య‌లు.. 45 యూట్యూబ్​ వీడియోలపై నిషేధం!

దేశంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు య‌త్నిస్తున్న శ‌క్తుల‌పై కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. లేటెస్ట్​గా ఓ 10 యూట్యూబ్ చానెళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది. ఈ 10 యూట్యూబ్ చానెళ్ల‌కు సంబంధించిన 45 వీడియోల‌ను పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ మేర‌కు ఇవ్వాల (సోమ‌వారం) కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

క‌శ్మీర్‌, భార‌త సైన్యం, అగ్నిప‌థ్‌పై అస‌త్యాల‌ను ప్ర‌చారం చేసేందుకు ఈ 10 యూట్యూబ్ చానెళ్లు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్లు కేంద్రం గుర్తించింది. మార్ఫింగ్ వీడియోల‌తో తాము అనుకున్న అంశాల‌ను జ‌నంలోకి వెళ్లేలా చేయ‌డానికి ఇవి య‌త్నించిన వైనాన్ని గ‌మ‌నించిన కేంద్రం వెనువెంట‌నే వాటిపై చ‌ర్య‌లు తీసుకున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement