Thursday, March 28, 2024

దేశాన్ని, రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రభుత్వాలు : పీసీసీ అధ్యక్షుడు శైలజా నాద్

దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దుర్మార్గపు పాలన తరిమికొట్టేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు శైలజా నాద్ అన్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ లో పాల్గొనేందుకు వచ్చిన అయన కడప నగరంలోని ఇందిరా భవన్ లో విలేకర్లతో మాట్లాడారు.ఈసందర్భంగా కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాలపై విమర్షలు చేశారు. మధ్య తరగతి పరిశ్రమలు మూతపడ్డాయని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిచడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. దొంగనోట్లు రెట్టింపు అవుతున్నాయని ఆర్.బీ.ఐ గగ్గోలు పెడుతున్నా కేంద్రం దృష్టి సారించడం లేదన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప దేనికి పనిరాని పీఎం, సీఎంలు అని విమర్శించారు. ఎనిమిదేళ్ల కాలంలో వినిపిస్తున్న పేర్లు ఆదానీ అంబానీలవేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లేకపోతే ఇబ్బంది కర పరిస్థితి ఉండేది అన్నారు.

కేంద్రంలో మోడీ నియంత : తులసిరెడ్డి
కేంద్రంలో మోడి నియంత అని, అప్పుల్లో కేంద్ర రాష్ట్ర పార్టీలు పోటీ పడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. దేశాన్ని అప్పుల భారతంగా నరేంద్ర మోడీ మార్చే శారన్నారు. శ్రీలంకను మించిన ఆర్థిక దుస్తితి ఏర్పడిందని, అమ్మకానికి భారత్.. ఆంద్రప్రదేశ్ లు వచ్చాయన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement