Friday, February 3, 2023

పేదల కళ్లలో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యం : సంగారెడ్డి కలెక్టర్ శరత్

సదాశివపేట  : పేదల కళ్ళల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శరత, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, పురపాలక సంఘం  చైర్ పర్సన పిల్లోడి జయమ్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర శరత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కండ్లల్లో చీకటిని తొలగించేందుకే కంటి వెలుగును ప్రారంభించారని, అర్హులైన ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందిస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. రాష్ట్ర పేద ప్రజల కళ్ళల్లో వెలుగు నింపేందుకే రెండో విడతగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రసంక్షేమ పథకాలను దేశంలో  ప్రవేశ పెట్టేందుకు కోసమే బీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రులు సంక్షేమ పథకాలను మెచ్చుకోవడం  జరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement