Thursday, April 25, 2024

త్వరలోనే శ్రీలంకకు రానున్న గొటబయ రాజపక్సే.. ప్రజల ఆగ్రహంతో అజ్ఞాతంలోకి

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అజ్ఞాతంలో లేరని, సింగపూర్‌ నుండి తిరిగి వస్తారని భావిస్తున్నట్లు క్యాబినెట్‌ అధికార ప్రతినిధి బందుల గుణ వర్ధన తెలిపారు. కొలొంబొ విలేకరుల సమావేశంలో గుణ వర్ధన మాట్లాడుతూ గోటబయ రాజపక్సే అధికారిక మార్గాల ద్వారా సింగపూర్‌ వెళ్లారని, అతను దాక్కున్నాడని చేసిన ప్రచారం అర్థరహితమన్నారు. ఈ విషయాన్ని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. జులై 13న శ్రీలంక నుంచి మాల్దివులకు బయలు దేరిన గొటబయ ఒక రోజు తర్వాత మాల్దిdవుల నుంచి సింగపూర్‌ చేరుకున్నారు.

73 ఏళ్ల రాజపక్సే జులై 9న ఆయన నివాసంపైకి నిరసనకారులు దాడి చేయడంతో అజ్ఞాతంలో వెళ్లిపోయారు. రాజపక్సే వ్యక్తిగత పర్యటన నిమిత్తం మాత్రమే సింగపూర్‌లో ప్రవేశించడానికి అనుమతించినట్లు, అతను ఆశ్రయం కోరలేదని, అతను ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా శ్రీలంక మాజీ అధ్యక్షుడిని యుద్ద నేరాలకు పాల్పడినందుకు అరెస్ట్‌ చేయాలని కోరుతూ దక్షిణాఫ్రికాకు చెందిన హక్కుల సంఘం సింగపూర్‌ అటార్నీ జనరల్‌కు ఫిర్యాదు చేసింది. అంతర్యుద్దం సమయంలో రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు జెనీవా ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించారని ఈ ఫిర్యాదులో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement