Saturday, June 10, 2023

600 కుటుంబాలు నివశిస్తున్నాయి రోడ్డు చూడండి కేటీఆర్ గారు: గోపీచంద్ మలినేని

హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితిపై టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “రాఘవేంద్ర సమాజం, కైతాలాపూర్, కూకట్‌పల్లి… కేటీఆర్ గారు ఇది అనాథాశ్రమం (చీర్స్ ఫౌండేషన్). ఈ కాలనీలో నివసిస్తున్న 600 కుటుంబాలకు దారి తీసే రహదారి ఇది. మీరు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నాను. గ్రేటర్ తెలంగాణ దిశగా మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు” అంటూ ఆ రోడ్డు పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 600 కుటుంబాలు నివసించే ఓ ప్రాంతంలో రోడ్డు ఏమాత్రం బాగాలేదని, అక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్లు నిర్మించడానికి చొరవ తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ను కోరారు. ఇక గోపిచంద్ ట్వీట్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అంశాలను సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ సెలెబ్రిటీగా తమవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement