Thursday, March 28, 2024

డాక్టర్ల చేతిరాత డీకోడ్‌కు గూగుల్‌ టెక్నాలజీ

డాక్టర్ల ప్రిస్కిప్షన్‌లోని గజిబిజి రాతను అర్ధం చేసుకునేలా గూగుల్‌ డీకోడింగ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. డాక్టర్ల చేతిరాతను డిజిటలైజ్‌ చేయడంలో ఉపయోగపడే ఆర్టిఫీషియల్‌ టెక్నాలజీపై తాము పనిచేస్తున్నామని గూగుల్‌ తెలిపింది. ఈ విషయాన్ని గూగుల్‌ ఫర్‌ ఇండియా 2022 కార్యక్రమంలో గూగుల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ మనీష్‌ గుప్తా వెల్లడించారు. ‘డాక్టర్లు ప్రిస్కిప్షన్‌ను చేత్తో రాస్తారనే విషయం మనందరికి తెలుసు. ఆ చీటీని చదవడం, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చామంటే.. అది గూగుల్‌ లెన్స్‌ ద్వారా డాక్టర్లు రాసిచ్చిన చీటీలోని మందులను గుర్తిస్తుంది’ అని మనీష్‌ గుప్తా తెలిపారు. ఢిల్లిdలో గూగుల్‌ ఫర్‌ ఇండియా 2022 ఈవెంట్‌ జరుగుతోంది. మనదేశంలో 8వ సారి జరుగుతున్న ఈ ఈవెంట్‌లో గూగుల్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సర్వీసులు, యాప్‌లనే ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.

రాష్ట్రపతితో సుందర్‌ పిచాయ్‌ భేటీ

భారత పర్యటనలో ఉన్న గూగల్‌, ఆల్ఫబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో ముర్ముతో గూగుల్‌ ఫర్‌ ఇండియా 2022 ఈవెంట్‌ గురించి ఆయన కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గూగుల్‌ ఈవెంట్‌ ప్రతిని అందజేశారు. ముర్ముతో పిచాయ్‌ దిగిన ఫొటోలను రాష్ట్రపతి భవన్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. భారతదేశ తెలివితేటలు, నైపుణ్యానికి సందర్‌ పిచాయ్‌ నిదర్శనమని రాష్ట్రపతి అన్నారు. అంతేకాదు భారతదేశంలో అంతర్జీయ డిజిటల్‌ అక్షరాస్యత కోసం కృషి చేయాలని కోరారు.

- Advertisement -

ఫిఫా వేళ గూగుల్‌ రికార్డు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌ వేళ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ సరికొత్త రికార్డును నమోదు చేసింది. 25 ఏళ్ల చరిత్రలో అత్యధిక సెర్చ్‌ ట్రాఫిక్‌ను చేరింది. ఈ విషయాన్ని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్వయంగా వెళ్లడించారు. ఫిఫా ఫైనల్‌ సమయంలో గూగుల్‌ సెర్చ్‌లో ఎక్కువగా వెతికారు. గత 25 ఏళ్లలో ఇదే అత్యధిక సెర్చ్‌ రికార్డు. ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గురించి సెర్చ్‌ చేసినట్లయింది అని సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌చేశారు. ఆదివారం నాటి ఫైనల్‌ అత్యుత్తమ ఆటల్లో ఒకటిగా నిలిచిందని, మెస్సీ చాలా గొప్పగా ఆడారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement