Monday, April 15, 2024

చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌

ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజన్‌గా గూగుల్‌ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. తాజాగా చాట్‌జీపీటీ రూపంలో ప్రధానమైన పోటీ ఎదురౌతున్నది. దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గూగుల్‌ సిద్దమవుతోంది. చాట్‌జీపీటీతో కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో మైక్రోసాఫ్ట్‌ యుద్ధానికి తెరతీసింది. దీన్ని అంతే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గూగుల్‌ కూడా పూర్తి స్థాయిలో సన్నహాలు చేస్తోంది. గూగుల్‌ బార్డ్‌ పేరుతో ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను సిద్ధం చేస్తోంది.

- Advertisement -

సులభంగా ఆవిష్కరణలు..

ప్రస్తుతం బార్డ్‌ను విశ్వసనీయ టెస్ట ర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తరువాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్త్రత స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు కడా బార్డ్‌ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్‌ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన చిట్కాలను సైతం బార్డ్‌ అందించగలుగుతందని పేర్కొంది. సృజనాత్మకత, ఉత్సుకతకు బార్డ్‌ ఓ వేదికగా మారుతుందిని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

అట్లాస్‌ పేరుతో ప్రాజెక్ట్‌..

చాట్‌జీపీటీ ఓపెన్‌ఏఐ అనేక కృత్రిమ మేథను మైక్రోసాఫ్ట్‌ రూపొందించింది. ఓపెన్‌ఏఐలో మైక్రోపాఫ్ట్‌ 2019లోనే 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్‌ఏఐకి అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో గూగుల్‌ అప్రమత్తమైంది. బార్డ్‌కు సంబంధించిన ప్రకటన చేసింది. గూగుల్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ)పై పని చేస్తున్న ఇంజినీర్లను అప్రమత్తం చేసింది. చాట్‌జీపీటీకి పోటీ ఇచ్చేలా బార్డ్‌ను అభివృద్ధి చేయాలని సూచించింది. అట్లాస్‌ ప్రాజెక్ట్‌ పేరుతో గూగుల్‌ ఈ బార్డ్‌ను తీర్చిదిద్దుతున్నది. బార్డ్‌ అనేది చాట్‌జీపీటీ తరహాలోనే కృత్రిమ మేథ ఆధారిత ప్రయోగాత్మక సంభాషణా సేవ. దీన్ని లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్‌ అప్లికేషన్‌ ఆధారంగా రూపొందించారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు అంతర్జాలం నుంచి తాజా, నాణ్యతతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది.

రెంటికి తేడాలు…

చాట్‌జీపీటీ విజయవంతం చేయడానికి ఓపెన్‌ఏఐకి మైక్రోసాఫ్ట్‌ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. దీన్ని బింగ్‌ సెర్చ్‌ ఇంజన్‌కు అనుసంధానించే పనిలో ఉంది. దీనికి పోటీగానే బార్డ్‌ను గూగుల్‌ తీసుకు వస్తున్నది. ప్రస్తుతం 2021 వరకు ఇంటర్నెట్‌లో అందుబాబులో ఉన్న సమాచారం అధారంగానే చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. బార్డ్‌ మాత్రం ఆన్‌లైన్‌లో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగించుకుంటోంది. ఇది బార్డ్‌కు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్‌జీపీటీ అందరికీ ఉతితంగానే అందుబాటులో ఉంది. చాట్‌జీపీట ప్లస్‌ పేరుతో పెయిడ్‌ వెర్షన్‌ కూడా అందిస్తున్నారు. బార్డ్‌ మత్రం ఇంకా కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. అందరూ దీన్ని ఉపయోగించుకునేందుకు మరింత కాలం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement