Saturday, October 12, 2024

China Masters | భారత్ శుభారంభం… తొలి రౌండ్‌లో సింగిల్స్, డబుల్స్‌లో విజయం

చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సెంకండ్ రౌండ్‌కి చేరుకున్నాడు. ఇవ్వాల (మంగళవారం) ప్రారంభమైన ఈ టోర్నీలో తన మొదటి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌పై వరుస గేమ్‌లలో 21-18, 22-20 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

కాగా, పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, ప్రియాంషు రజావత్‌లు రేపు (బుధవారం) బరిలోకి దిగనున్నారు.

- Advertisement -

ఇక‌, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేతలైన మెన్స్ డ‌బుల్స్ టీమ్ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌లు కూడా సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌లేన్‌, సీన్‌ వెండీపై వరుస గేమ్‌లలో 21-13, 21-10 తేడాతో విజయం సాధించారు. రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన అకిరా కోగా మరియు తైచి సైటోతో తలపడనున్నారు.

మహిళల సింగిల్స్‌లో ఏకైక భారతీయ ఛాలెంజర్ అయిన ఆకర్షి కశ్యప్… చైనాకు చెందిన జాంగ్ యి మాన్ తో జరిగిన మ్యాచ్‌లో 12-21, 14-21తో ఓటమిపాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement