Friday, September 24, 2021

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీకి కేబినెట్ ఆమోదం పలికింది. దీంతో ఈ ఏడాది రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి రుణమాఫీని ప్రభుత్వం చేపట్టనుంది. రూ.50వేల లోపు రుణాలు ఉన్న రైతులకు ఈనెలాఖరులోగా నిధులను ఖాతాలో జమ చేయనుంది.

కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలో 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు పంట రుణ మాఫీ వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్‌కు అందజేసింది. మరోవైపు ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం అధికారులతో చర్చించారు. కరోనా వల్ల అనాథలైన పిల్లల వివరాలు ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఈ వార్త కూడా చదవండి: ట్రిపుల్ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News