పసిడి ప్రియులకు తీపికబురు. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. గత మూడు రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 మేర దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు అయితే తులానికి రూ. 710 క్షీణించింది. ఈరోజు అంటే జూలై 18న బంగారం ధరలను గమనిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి రేటు రూ.50,390 వద్ద ఉంది. అదేసమయంలో ఆర్నమెంటల్ గోల్డ్ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,190 వద్ద కొనసాగుతోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. మరోవైపు వెండి ధర విషయానికి వస్తే.. సిల్వర్ రేటు స్థిరంగానే కొనసాగుతోంది. నేడు వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. వెండి ధర కేజీకి రూ. 60,700 వద్ద ఉంది.
- Advertisement -