Thursday, April 25, 2024

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. IRCTC ఆన్‌లైన్ బుకింగ్ పరిమితులను డబుల్..

రైల్వే ప్రయాణికులకు IRCTC శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్ టిక్కెట్ల సంఖ్యను రెట్టింపు చేయాల‌ని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే సోమవారం వెల్ల‌డించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం మేర‌కు.. ఒక ఐడీ నుంచి ఒక టికెట్ కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఆధార్ లింక్ చేసిన వారు మాత్రమే తమ IDలో నెలకు గరిష్టంగా 24 టిక్కెట్‌లను బుక్ చేసుకోగలరు. అంటే IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌తో ఆధార్ లింక్‌తో ఉన్న వినియోగదారులు ఇప్పుడు నెలకు 24 టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.
గతంలో ఈ పరిమితి 12 టిక్కెట్లు మాత్రమే ఉండేది. అయితే, ఆధార్-లింక్ లేని వినియోగదారు 12 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి ఆరు టిక్కెట్లు మాత్రమే అని తెలిసింది.

IRCTC-ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలి.?

రైల్వే అధికారిక వెబ్‌సైట్ irctc.co.inకి లాగిన్ అవ్వండి. తర్వాత My Account ఆప్షన్‌లోకి వెళ్లి LINK YOUR AADHAR ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత సంబంధిత ముఖ్యమైన వివరాలను నమోదు చేసుకోవాలి. వివరాలను పూరించిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ OTPని నమోదు చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement