Sunday, March 24, 2024

ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం వెండి, ధ‌ర‌లు..

బంగారం కొనాల‌కునేవారికి ఇది శుభ‌వార్తే అని చెప్పాలి. గ‌త నెల‌లో భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ప్ర‌స్తుతం నేల‌చూపులు చూస్తున్నాయి. నిన్న‌, ఈరోజు బంగారం ధ‌ర‌లు ప‌త‌న‌మ‌య్యాయి. హైద‌రాబాద్, ఢిల్లీ బంగారం ధ‌ర‌లు ఒక‌సారి లుక్కేయండి.. హైదరాబాద్‌లో చూస్తే 22 క్యారెట్ గోల్డ్ రేటు తులానికి తాజాగా రూ.200 పతనమైంది. దీంతో ఇప్పుడు రూ.51,800 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు చూస్తే రూ.220 పడిపోయి రూ.56,510 మార్కుకు పడిపోయింది. ఇక గత 6 రోజులుగా గోల్డ్ రేటు పడుతూనే ఉంది. ఈ మధ్యలో అసలు పెరగకపోవడం గమనార్హం. ఇది మున్ముందు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దిల్లీలో కూడా బంగారం ధర పతనం కొనసాగుతోంది. దేశరాజధానిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.200 పడిపోగా.. ప్రస్తుతం తులానికి రూ.51,950 మార్కు వద్ద ఉంది. ఇదే 24 క్యారెట్లకు రూ.220 పతనం కాగా రూ.56,660కు చేరింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. హైదరాబాద్, దిల్లీల్లో తాజాగా సిల్వర్ రేట్లు కూడా పడిపోయాయి. మన హైదరాబాద్‌లో వెండి రేటు తాజాగా రూ.600 పడిపోయి కిలోకు రూ.71,200 వద్ద కొనసాగుతోంది. 3 రోజులు వరుసగా తగ్గడం విశేషం. ఇక దిల్లీలో రూ.400 పడిపోగా ప్రస్తుతం అక్కడ కేజీ వెండి రూ.68,600కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement