Friday, March 29, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సెట్స్ లో ప‌వ‌ర్ స్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అయితే సెట్స్ పైకి వెళ్ళాల్సిన కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా తాజాగా ద‌ర్శ‌కుడు క్రిష్ హరి హర వీరమల్లు తాజా షెడ్యూల్ కోసం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నార‌ట‌. ఇక లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కాగా పవన్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ ట్వీట్ చేశారు. సెట్స్ లో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ని చూడటం గొప్పగా ఉందని ఆయన ట్వీట్ లో కామెంట్ చేశారు. హరి హర వీరమల్లు చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కాగా దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయాల్సి ఉంది. పవన్ పొలిటికల్ అజెండాల కారణంగా ఆలస్యం అవుతుంది. చాలా కాలంగా హరీష్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో భవదీయుడు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement