Tuesday, April 23, 2024

నర్సింగ్‌ విద్యార్ధులకు శుభవార్త.. స్టాఫ్‌ నర్సుల భర్తీకి నోటిఫికేషన్‌..

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: వరుస నోటిఫికేషన్లతో తెలంగాణలో ఉద్యోగ జాతర సాగుతోంది. కొలువుల పండుగలో భాగంగా కొత్త ఏడాది సమీపిస్తున్న సందర్భంలో భారీగా స్టాప్‌ నర్సుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నర్సింగ్‌ విద్యార్ధులకు శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం 5204 స్టాప్‌ నర్సుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ వెల్లడించింది. శుక్రవారంనాడు రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

అర్హులైన అభ్యర్ధులనుంచి జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు, ఎంఎన్‌జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు…

డీఎంఈ, డీహెచ్‌ 3823
వైద్యవిధాన పరిషత్‌ 757
ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ 81
డిజేబుల్డ్‌, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ 8
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ 127
బీసీ వెల్ఫేర్‌ రెసిడిన్షియల్‌ 197
ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ 74
సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ 124
తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ 13

Advertisement

తాజా వార్తలు

Advertisement