Friday, March 29, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ 4 శాతం పెంచే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. త్వరలోనే వీరికి 4 శాతం మేర కరరువు భత్యాన్ని పంఎచే అవకాశం ఉంది. దీంతో మూలవేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. ఈ విషయంపై ఆల్‌ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివ గోపాల్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్‌కు సంబంధించిన పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

ఆర్ధిక శాఖ ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచనుందని తెలిపారు. ఈ ప్రాతిపాదనను కేంద్రం ఆమోదిస్తే తాజా డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్ర భుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరువు భత్యం పొందుతున్నారు. డీఏలో చివరి సవరణ సెప్టెంబర్‌ 28, 2022 న జరిగింది. ఇది జులై 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందచేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement